సర్వీస్ నియమాలు

సర్వీస్ నియమాలను ఇతర భాషలలో చూడండి: English, অসমীয়া, ગુજરાતી, ಕನ್ನಡ, മലയാളം, मराठी, ଓଡ଼ିଆ, ਪੰਜਾਬੀ, தமிழ், తెలుగు మరియు हिन्दी

ఈ నియమాలలో ఏమేమి ఉంటాయి?

మా సర్వీస్ నియమాలకు (నియమాలు) మేము చేసిన కొన్ని కీలకమైన అప్‌డేట్‌లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడేలా ఈ ఇండెక్స్ డిజైన్ చేయబడింది. ఇది ఉపయోగకరమైన గైడ్‌గా మీకు పనికి వస్తుందని ఆశిస్తున్నాము, అయితే దయచేసి మీరు నియమాలన్నింటినీ పూర్తిగా చదివేలా చూసుకోండి.

YouTubeకు స్వాగతం!

ఈ విభాగం మీతో మాకు ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. ఇందులో సర్వీస్ వివరణ ఉంటుంది, మన ఒప్పందాన్ని ఇది నిర్వచిస్తుంది, అలాగే మీ సర్వీస్ ప్రొవైడర్ పేరు ఇందులో ఉంటుంది.

సర్వీస్‌ను ఎవరు ఉపయోగించవచ్చు?

ఈ విభాగం, ఈ సర్వీస్ వినియోగానికి సంబంధించి నిర్దిష్ట ఆవశ్యకతలను సెట్ చేస్తుంది, అలాగే యూజర్‌ల కేటగిరీలను నిర్వచిస్తుంది.

సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగం

ఈ విభాగం, సర్వీస్‌ను ఉపయోగించడానికి మీకు ఉండే హక్కులను, అలాగే సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగానికి వర్తించే షరతులను వివరిస్తుంది. సర్వీస్‌కు మేము ఏ విధంగా మార్పులు చేసే అవకాశం ఉందో కూడా ఇది వివరిస్తుంది.

మీ కంటెంట్, ఇంకా ప్రవర్తన

ఈ విభాగం, సర్వీస్‌కు కంటెంట్‌ను అందించే యూజర్‌లకు వర్తిస్తుంది. మీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా మీరు మంజూరు చేసే అనుమతుల పరిధిని ఇది నిర్వచిస్తుంది, అలాగే ఇతరుల హక్కులను అతిక్రమించేలా ఉండే కంటెంట్‌ను అప్‌లోడ్ చేయకూడదనే మీ సమ్మతి కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

ఖాతా సస్పెన్షన్, రద్దు

మీరు, అలాగే YouTube ఈ బంధాన్ని ఎలా ముగించవచ్చో ఈ విభాగం వివరిస్తుంది.

సర్వీస్‌లోని సాఫ్ట్‌వేర్ గురించి

సర్వీస్‌లో ఉపయోగించబడే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వివరాలు ఈ విభాగంలో ఉంటాయి.

ఇతర చట్టపరమైన నియమాలు

మా సర్వీస్‌ను అందించే విషయంలో మీ పట్ల మాకు ఉండే నిబద్ధతను ఈ విభాగం వివరిస్తుంది. మేము బాధ్యత వహించని కొన్ని విషయాలు ఉన్నాయని కూడా ఈ విభాగం వివరిస్తుంది.

ఈ ఒప్పందం గురించి

ఈ నియమాలకు మేము మార్పులను చేయాల్సి వస్తే, మీరు ఏమి ఆశించవచ్చు, లేదా వాటికి ఏ చట్టం వర్తిస్తుంది వంటి అంశాలతో సహా, మన ఒప్పందానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన వివరాలు కొన్ని ఈ విభాగంలో ఉంటాయి.

సర్వీస్ నియమాలు

తేదీ: 5 జనవరి, 2022

సర్వీస్ నియమాలు

YouTubeకు స్వాగతం!

పరిచయం

ప్లాట్‌ఫామ్ నుండి మీకు అందించబడే YouTube ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, ఫీచర్‌లను (వీటన్నింటినీ కలిపి "సర్వీస్" అని రెఫర్ చేయడం జరుగుతుంది) ఉపయోగిస్తున్నందుకు ధన్యవాదాలు.  

మా సర్వీస్

ఈ సర్వీస్ మీరు వీడియోలను, ఇతర కంటెంట్‌ను కనుగొని, చూసి, షేర్ చేసే వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే వ్యక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, సమాచారం తెలపడానికి, స్ఫూర్తిని అందించడానికి ఒక వేదికగా ఉంటుంది. అంతే కాకుండా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్‌లు, అడ్వర్టయిజర్‌లందరికీ ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరిస్తుంది. మా ప్రోడక్ట్‌లకు సంబంధించి బోలడంత సమాచారాన్ని, అలాగే దానిని ఎలా ఉపయోగించాలి అనే వివరాలను, మేము మా సహాయ కేంద్రంలో అందిస్తాము. ఇతర అంశాలతో సహా, మీరు YouTube Kids, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఇంకా YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌లు, కొనుగోళ్ల (అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో) గురించి తెలుసుకోవచ్చు. అలాగే, మీ టెలివిజన్, మీ గేమ్ కన్సోల్ వంటి ఇతర పరికరాలలో, లేదా Google Homeలో ఆస్వాదించగల మొత్తం కంటెంట్ గురించి మీరు చదవవచ్చు.

మీ సర్వీస్ ప్రొవైడర్

సర్వీస్‌ను అందించే ఎంటిటీ, Google LLC, ఇది డెలవేర్ చట్టాలకు అనుగుణంగా పని చేసే కంపెనీ, దీని అడ్రస్, 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043 (దీన్ని “YouTube”, “మేము”, “మాకు”, లేదా “మా” అని రెఫర్ చేయడం జరుగుతుంది). ఈ నియమాలలో YouTube "అనుబంధ సంస్థలు" అంటే, Alphabet Inc. కార్పొరేట్ గ్రూప్‌లో భాగంగా ఉండే కంపెనీలు (ఇప్పుడు ఉన్నవి కానీ, లేదా భవిష్యత్తులో భాగం అయ్యేవి కానీ) అని అర్థం.

వర్తించే నియమాలు

మీరు సర్వీస్‌ను ఉపయోగించేటప్పుడు, ఈ నియమాలను, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను, పాలసీ, భద్రత, అలాగే కాపీరైట్ పాలసీలను పాటించాల్సి ఉంటుంది, ఇవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది (వీటన్నింటినీ కలిపి "ఒప్పందం" అని రెఫర్ చేయడం జరుగుతుంది). మీరు సర్వీస్‌కు అడ్వర్టయిజింగ్‌ను కానీ, లేదా స్పాన్సర్‌షిప్‌లను కానీ అందిస్తున్నట్లయితే, లేదా మీ కంటెంట్‌లో పెయిడ్ ప్రమోషన్‌లను చేర్చి ఉన్నట్లయితే, మాతో మీకు ఉండే ఒప్పందంలో, YouTubeలో అడ్వర్టయిజింగ్‌కు సంబంధించిన పాలసీలు కూడా భాగంగా ఉంటాయి. ఈ నియమాలలో ఇతర లింక్‌లు లేదా రెఫరెన్స్‌లు ఏవైనా అందించి ఉంటే, అవి కేవలం సమాచారం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే అందించబడ్డాయని, ఒప్పందంలో అవి భాగం కాదని గమనించండి.

దయచేసి ఈ ఒప్పందాన్ని జాగ్రత్తగా చదివి, దాన్ని అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. మీకు ఒప్పందం అర్థం కాకపోయినా, లేదా అందులో ఏ భాగం అయినా మీకు అంగీకారం కాకపోయినా, సర్వీస్‌ను ఉపయోగించకండి.

ఈ ఒప్పందాన్ని అంగీకరించడం ద్వారా, మీకు 18 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉందని, అలాగే ఈ ఒప్పందంలో భాగం అవ్వడానికి, ఇంకా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి, దాన్ని పాటించడానికి మీకు పూర్తి అర్హత ఉందని మీరు ధృవీకరిస్తున్నారు. ఒకవేళ మీ వయస్సు 18 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే, దిగువనున్న పరిమితులు, ఆవశ్యకతలు వర్తిస్తాయి.

సర్వీస్‌ను ఎవరు ఉపయోగించవచ్చు?

వయో అర్హతలు

సర్వీస్‌ను ఉపయోగించడానికి మీ వయస్సు తప్పనిసరిగా కనీసం 13 ఏళ్లు ఉండాలి; అయితే, తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ కనుక ఎనేబుల్ చేసినట్లయితే, అన్ని వయస్సులకూ చెందిన పిల్లలు సర్వీస్‌ను, అలాగే YouTube Kidsను (అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో) ఉపయోగించవచ్చు. 

తల్లి/తండ్రి లేదా గార్డియన్ అనుమతి

మీ వయస్సు మీ దేశంలో మైనర్‌గా పరిగణించే వయస్సు అయితే, సర్వీస్‌ను ఉపయోగించడానికి మీకు మీ తల్లి/తండ్రి లేదా గార్డియన్ అనుమతి ఉన్నట్లు మీరు సూచిస్తున్నారు. దయచేసి మీరు, అలాగే మీ తల్లి/తండ్రి లేదా గార్డియన్ కలిసి ఈ ఒప్పందాన్ని చదవండి.

మీ దేశంలోని మైనర్‌కు మీరు తల్లి/తండ్రి లేదా లీగల్ గార్డియన్ అయితే, సర్వీస్‌ను ఉపయోగించడానికి మీ చిన్నారిని అనుమతించడం ద్వారా, ఈ ఒప్పందం తాలూకు నియమాలను మీరు పాటించాల్సి ఉంటుందని, అలాగే సర్వీస్‌లో మీ చిన్నారి జరిపే యాక్టివిటీకి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని గమనించండి. YouTubeలో మీ ఫ్యామిలీ అనుభవాన్ని మేనేజ్ చేయడంలో సహాయపడటంతో సహా ఈ సర్వీస్‌ను, అలాగే YouTube Kidsను 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారి ఉపయోగించడాన్ని ఎలా ఎనేబుల్ చేయాలి అనే విషయంలో మీకు సహాయపడే టూల్స్, రిసోర్స్‌లు, మా సహాయ కేంద్రంలో, ఇంకా Google Family Link‌లో అందుబాటులో ఉంటాయి.

బిజినెస్‌లు

మీరు ఏదైనా ఒక కంపెనీ లేదా సంస్థ తరఫున ఈ సర్వీస్‌ను ఉపయోగిస్తుంటే, ఆ ఎంటిటీ తరఫున వ్యవహరించే అధికారం మీకు ఉందని, అలాగే సదరు ఎంటిటీ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని మీరు విస్పష్టంగా తెలియజేస్తున్నారు.

సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగం

సర్వీస్‌లోని కంటెంట్

ఈ సర్వీస్‌లోని కంటెంట్‌లో వీడియోలు, ఆడియో (ఉదాహరణకు, మ్యూజిక్, ఇతర సౌండ్‌లు), గ్రాఫిక్స్, ఫోటోలు, టెక్స్ట్ (కామెంట్‌లు, స్క్రిప్ట్‌లు వంటివి), బ్రాండింగ్ (వ్యాపార సంస్థల పేర్లు, వ్యాపారచిహ్నాలు, సర్వీస్ మార్క్‌లు, లేదా లోగోలతో సహా), ఇంటరాక్టివ్ ఫీచర్‌లు, సాఫ్ట్‌వేర్, కొలమానాలు, ఇంకా ఇతర మెటీరియల్స్ ఉంటాయి (వీటన్నింటినీ కలిపి "కంటెంట్" అని రెఫర్ చేయడం జరుగుతుంది).

కంటెంట్ విషయంలో బాధ్యత అనేది, ఏ వ్యక్తి లేదా ఎంటిటీ ద్వారా అయితే అది సర్వీస్‌కు అందించబడుతోందో, ఆ వ్యక్తి లేదా ఎంటిటీపై ఉంటుంది. కంటెంట్‌ను హోస్ట్ చేయడానికి లేదా అందించడానికి సంబంధించి YouTubeపై ఎటువంటి బాధ్యతా ఉండదు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను లేదా చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు, ఈ ఒప్పందానికి అనుగుణంగా లేదు అనిపించే కంటెంట్ ఏదైనా కనిపిస్తే, మీరు దాని గురించి మాకు రిపోర్ట్ చేయవచ్చు.

Google ఖాతాలు, YouTube ఛానెల్స్

మీరు Google ఖాతా లేకుండానే, బ్రౌజ్ చేయడం, కంటెంట్ కోసం సెర్చ్ చేయడం వంటి, సర్వీస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించవచ్చు. అయితే, కొన్ని ఫీచర్‌లను ఉపయోగించడానికి మీకు Google ఖాతా అవసరం అవుతుంది. Google ఖాతాతో, మీరు వీడియోలను లైక్ చేయవచ్చు, ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు, మీ సొంత YouTube ఛానెల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా మరెన్నో చేయవచ్చు. Google ఖాతాను క్రియేట్ చేయడానికి ఈ సూచనలను ఫాలో అవండి.

YouTube ఛానెల్‌ను క్రియేట్ చేయడం వలన, వీడియోలను అప్‌లోడ్ చేయడం, కామెంట్‌లు చేయడం లేదా ప్లేలిస్ట్‌లను క్రియేట్ చేయడం (అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో) వంటి అదనపు ఫీచర్‌లకు, ఫంక్షన్‌లకు మీకు యాక్సెస్ లభిస్తుంది. మీ సొంత YouTube ఛానెల్‌ను క్రియేట్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి కొన్ని వివరాలు ఇక్కడ అందించబడ్డాయి.

మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి, మీ పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచుకోండి. మీ Google ఖాతా పాస్‌వర్డ్‌నే మళ్లీ థర్డ్-పార్టీ అప్లికేషన్‌లలో ఉపయోగించకండి. మీ పాస్‌వర్డ్ లేదా Google ఖాతా అనధికారికంగా ఉపయోగించబడిందని మీకు తెలిసినప్పుడు ఏం చేయాలి అనే విషయంతో సహా, మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడం గురించి కూడా మరింత తెలుసుకోండి.

మీ సమాచారం

మీరు ఈ సర్వీస్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీ వ్యక్తిగత డేటాను ఎలా హ్యాండిల్ చేస్తాము, అలాగే మీ గోప్యతను ఎలా సంరక్షిస్తాము అనే అంశాలను మా గోప్యతా పాలసీ వివరిస్తుంది. YouTube Kidsకు మాత్రమే ప్రత్యేకమైన మా గోప్యతా పద్ధతుల గురించి YouTube Kids గోప్యతా ప్రకటన అదనపు సమాచారాన్ని అందిస్తుంది.

సర్వీస్‌కు మీరు అప్‌లోడ్ చేసే ఏదైనా ఆడియో లేదా ఆడియో విజువల్ కంటెంట్‌ను YouTube డేటా ప్రాసెసింగ్ నియమాలకు అనుగుణంగా మేము ప్రాసెస్ చేస్తాము, అయితే అటువంటి కంటెంట్‌ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా కుటుంబ యాక్టివిటీల కోసం మీరు అప్‌లోడ్ చేసిన సందర్భాలకు ఇది వర్తించదు. మరింత తెలుసుకోండి.

అనుమతులు, పరిమితులు

ఈ ఒప్పందాన్ని, అలాగే వర్తించే చట్టాన్ని మీరు పాటించినంత కాలం, మీకు అందుబాటులో ఉంచబడిన సర్వీస్‌ను మీరు ఉపయోగించవచ్చు. మీ వ్యక్తిగత, అలాగే వాణిజ్యేతర వినియోగం కోసం కంటెంట్‌ను మీరు చూడవచ్చు లేదా వినవచ్చు. మీరు పొందుపరచదగిన YouTube ప్లేయర్ ద్వారా కూడా YouTube వీడియోలను చూపవచ్చు.

సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగానికి ఈ దిగువనున్న పరిమితులు వర్తిస్తాయి. ఈ కింద పేర్కొన్న వాటిని చేయడానికి మీకు అనుమతి లేదు:

  1. ఇక్కడ పేర్కొన్న సందర్భాలలో తప్ప, సర్వీస్‌కు సంబంధించిన ఏ భాగాన్ని అయినా కానీ లేదా ఏ కంటెంట్‌ను అయినా కానీ యాక్సెస్ చేయడం, తిరిగి క్రియేట్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, బదిలీ చేయడం, ప్రసారం చేయడం, ప్రదర్శించడం, విక్రయించడం, లైసెన్స్ జారీ చేయడం, సవరించడం, మార్చడం, లేదా ఉపయోగించడానికి అనుమతి లేదు. ఆ ప్రత్యేక సందర్భాలు: (a) సర్వీస్ స్పష్టంగా సదరు అధికారాన్ని ఇచ్చినప్పుడు; లేదా (b) YouTube నుండి ముందస్తుగా రాతపూర్వక అనుమతి పొందినప్పుడు, అలాగే వర్తించినట్లయితే, సంబంధిత హక్కుదారుల నుండి కూడా ముందస్తుగా రాతపూర్వక అనుమతి పొందినప్పుడు; 
  2. సెక్యూరిటీ సంబంధిత ఫీచర్‌లు లేదా (a) కంటెంట్‌ను కాపీ చేయడాన్ని లేదా కంటెంట్‌కు సంబంధించి ఇతర వినియోగాన్ని నిరోధించే లేదా పరిమితం చేసే, లేదా (b) సర్వీస్ లేదా కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేసే ఫీచర్‌లతో సహా, సర్వీస్‌కు సంబంధించిన ఏ భాగాన్ని అయినా అతిక్రమించడం, డిజేబుల్ చేయడం, మోసపూరితంగా ఎంగేజ్ అవ్వడం, లేదా అంతరాయం కలిగించడానికి (లేదా ఈ పనులలో దేనినైనా చేయాలని ప్రయత్నించడానికి) అనుమతి లేదు;
  3. ఇక్కడ పేర్కొన్న సందర్భాలలో తప్ప, ఏ ఆటోమేటెడ్ పద్ధతుల ద్వారా అయినా (ఉదాహరణకు, రోబోట్‌లు, బాట్‌నెట్‌లు, లేదా స్క్రాపర్‌ల ద్వారా) సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతి లేదు. ఆ ప్రత్యేక సందర్భాలు: (a) పబ్లిక్ సెర్చ్ ఇంజిన్‌ల విషయంలో, YouTube robots.txt ఫైల్‌కు అనుగుణంగా ఉన్నప్పుడు; లేదా (b) YouTube నుండి ముందస్తుగా రాతపూర్వక అనుమతి పొందినప్పుడు;
  4. ఏ వ్యక్తిని అయినా గుర్తించగల సమాచారాన్ని కలెక్ట్ చేయడానికి, లేదా సేకరించడానికి (ఉదాహరణకు, యూజర్‌నేమ్‌లను లేదా ముఖాలను సేకరించడానికి) అనుమతి లేదు, ఇలా చేయాలంటే, సంబంధిత వ్యక్తి నుండి అనుమతి పొంది ఉండాలి లేదా పైన ఉండే విభాగం (3) ప్రకారం అది అనుమతించబడినది అయినా అయి ఉండాలి;
  5. అవాంఛిత ప్రమోషనల్ కంటెంట్‌ను లేదా వాణిజ్యపరమైన కంటెంట్‌ను, లేదా ఇతర అవాంఛిత విన్నపాలను లేదా పెద్ద సంఖ్యలో విన్నపాలను డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ సర్వీస్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు;
  6. వీడియో వీక్షణలు, లైక్‌లు, లేదా డిస్‌లైక్‌ల సంఖ్యను పెంచడానికి, లేదా ఛానెల్ సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్యను పెంచడానికి, వ్యక్తులకు పేమెంట్ చేయడం లేదా ప్రోత్సాహకాలను ఇవ్వడం, లేదా ఇంకే పద్ధతిలోనైనా కొలమానాలను మార్చడం వంటివి చేయడం ద్వారా ఈ సర్వీస్‌లో వాస్తవ యూజర్ ఎంగేజ్‌మెంట్ తెలియకుండా, తప్పుడు కొలమానాలను క్రియేట్ చేయడానికి లేదా అలా చేయండి అని ప్రోత్సహించడానికి అనుమతి లేదు;
  7. నిరాధారమైన, చికాకు కలిగించే, లేదా వ్యర్థమైన అంశాలను సమర్పించడం ద్వారా ఏదైనా రిపోర్టింగ్‌ను, ఫ్లాగ్ చేయబడిన దాన్ని, ఫిర్యాదును, వివాదాన్ని, లేదా అప్పీళ్ల ప్రాసెస్‌ను దుర్వినియోగపరచడానికి వీల్లేదు;
  8. సర్వీస్‌లో, లేదా సర్వీస్ ద్వారా, YouTube పోటీ పాలసీలు, గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేని పోటీలను రన్ చేయకూడదు;
  9. వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం కంటెంట్‌ను చూడటానికి, లేదా వినడానికి సర్వీస్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు
  10. (ఉదాహరణకు, సర్వీస్ నుండి మీరు వీడియోలను పబ్లిక్‌గా ప్రదర్శించరాదు లేదా మ్యూజిక్‌ను పబ్లిక్‌గా స్ట్రీమ్ చేయరాదు); లేదా
  11. (a) YouTubeలో అడ్వర్టయిజింగ్ పాలసీలలో అనుమతించబడినట్లుగా కాకుండా (అంటే, పాలసీకి అనుగుణంగా ఉండే ప్రోడక్ట్ నియామకాల వంటివి కాకుండా), ఈ సర్వీస్‌లో లేదా కంటెంట్‌పై, దాని చుట్టు పక్కల, లేదా లోపల ఉంచబడిన అడ్వర్టయిజింగ్, స్పాన్సర్‌షిప్‌లు, లేదా ప్రమోషన్‌లను విక్రయించడానికి; లేదా (b) కేవలం ఈ సర్వీస్‌లోని కంటెంట్ మాత్రమే ఉన్న ఏ వెబ్‌సైట్‌లో అయినా లేదా ఏ అప్లికేషన్‌లోని ఏ పేజీలో అయినా, లేదా సదరు పేజీలో లేదా వెబ్‌సైట్‌లో సర్వీస్ నుండి వచ్చిన కంటెంట్ మాత్రమే ప్రధాన ఆధారంగా ఉన్నప్పుడు (ఉదాహరణకు, YouTube వీడియోలను చూడటానికి మాత్రమే యూజర్లు సందర్శిస్తున్న ఒక వెబ్‌పేజీలో యాడ్‌లను ప్లేస్ చేయడం) అడ్వర్టయిజింగ్‌ను, స్పాన్సర్‌షిప్‌లను, లేదా ప్రమోషన్‌లను విక్రయించడానికి ఈ సర్వీస్‌ను ఉపయోగించేందుకు అనుమతి లేదు.

రిజర్వేషన్

సర్వీస్‌ను ఉపయోగించినంత మాత్రాన, యూజర్‌నేమ్‌లు లేదా ఇతరులు పోస్ట్ చేసే ఇతర కంటెంట్ లేదా YouTubeతో సహా, సర్వీస్‌కు సంబంధించిన ఏ అంశం మీదనైనా కానీ మీకు యాజమాన్య హక్కు దక్కదు, లేదా హక్కులు లభించవు).

సర్వీస్‌ను డెవలప్ చేయడం, మెరుగుపరచడం, ఇంకా అప్‌డేట్ చేయడం

ఈ సర్వీస్‌ను YouTube నిరంతరం అప్‌డేట్ చేస్తుంటుంది, మెరుగుపరుస్తూ ఉంటుంది. ఈ నిరంతర అభివృద్ధిలో భాగంగా, ఫీచర్‌లను, ఫంక్షనాలిటీలను జోడించడం లేదా తీసివేయడం, కొత్త డిజిటల్ కంటెంట్‌ను లేదా సర్వీస్‌లను అందించడం లేదా పాత వాటిని నిలిపివేయడం వంటి సవరణలను లేదా మార్పులను (మొత్తం సర్వీస్‌కు లేదా సర్వీస్‌లోని కొంత భాగానికి) మేము చేయవచ్చు. పనితీరు సంబంధిత లేదా సెక్యూరిటీ సంబంధిత మెరుగుదలలు చేయడానికి, చట్టానికి అనుగుణంగా ఉండేలా మార్పులు చేయడానికి, లేదా మా సిస్టమ్‌లలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి, లేదా సిస్టమ్‌ల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, మేము సర్వీస్‌ను కానీ, లేదా సర్వీస్‌లోని కొంత భాగాన్ని కానీ మార్చవచ్చు లేదా నిలిపివేయవచ్చు. ఈ మార్పుల వలన యూజర్‌లందరూ కానీ, కొందరు యూజర్‌లు కానీ, లేదా ఒకే ఒక్క యూజర్ కానీ ప్రభావితం కావచ్చు. సర్వీస్‌కు డౌన్‌లోడ్ చేయగల సాఫ్ట్‌వేర్ (ఉదాహరణకు, YouTube Studio అప్లికేషన్) అవసరం అయినప్పుడు, లేదా సర్వీస్‌లో సదరు సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు, కొత్త వెర్షన్ లేదా ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు, ఆ సాఫ్ట్‌వేర్ మీ పరికరంలో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవ్వవచ్చు, ఈ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవ్వడం అనేది మీ పరికర సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టపరమైన అవసరాలకు ప్రతిస్పందించడం, లేదా సెక్యూరిటీ, అలాగే కార్యాచరణ సంబంధిత సమస్యలను పరిష్కరించడం వంటి అత్యవసర పరిస్థితులలో తప్ప, సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ఏవైనా గణనీయమైన మార్పులను చేస్తే, మీకు సముచిత అడ్వాన్స్ నోటీసును అందిస్తాము. వర్తించే చట్టం, ఇంకా పాలసీలకు లోబడి, Google Takeout‌నుఉపయోగించి, మీ Google ఖాతా నుండి మీ కంటెంట్‌ను ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా మేము మీకు అందిస్తాము.

మీ కంటెంట్, ఇంకా ప్రవర్తన

కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం

మీకు YouTube ఛానెల్ ఉంటే, మీరు సర్వీస్‌కు కంటెంట్‌ను అప్‌లోడ్ చేయగలరు. మీ బిజినెస్‌ను లేదా ఆర్టిస్టిక్ ఎంటర్‌ప్రైజ్‌ను ప్రమోట్ చేయడానికి మీ కంటెంట్‌ను మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు కంటెంట్‌ను అప్‌లోడ్ చేయాలనుకుంటే, ఈ ఒప్పందానికి (YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌తో సహా) లేదా వర్తించే చట్టానికి(లకు) అనుగుణంగా లేని కంటెంట్‌ను సర్వీస్‌కు అస్సలు సమర్పించకూడదు.

ప్రత్యేకించి, కంటెంట్ తప్పనిసరిగా ఈ కింద పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండాలి:

a. గోప్యతతో సహా, ఇతరుల హక్కులను గౌరవించేదిగా ఉండాలి;

b. థర్డ్-పార్టీ మేధోసంపత్తి (ఉదాహరణకు, కాపీరైట్ చేసిన మెటీరియల్) అస్సలు ఉండకూడదు, అలా ఉండాలంటే ఆ పార్టీ నుండి మీరు అనుమతి పొంది ఉండాలి, లేదా చట్టబద్ధంగా అలా చేయడానికి సంబంధించిన అర్హత మీకు ఉండాలి;

c. దుర్వినియోగానికి పాల్పడటం లేదా ఇతరులకు గానీ లేదా స్వయంగా గానీ హాని కలుగజేసుకోవడం (లేదా బెదిరించడం లేకుంటే అలాంటి దుర్వినియోగాన్ని లేదా హానిని ప్రోత్సహించడం) వంటివి అస్సలు ఉండకూడదు, ఇలా చిన్నారుల పట్ల జరిగినా కూడా ఇది వర్తిస్తుంది;

d. తప్పుదోవ పట్టించే, చూడగానే అబద్ధం అని తెలిసిపోయే, లేదా మోసగించే అంశాలు ఉండకూడదు;

e. చట్టవిరుద్ధంగా మరొక వ్యక్తిలా నటించడం, ఇతరులకు పరువు నష్టం కలిగించడం, జులుం చలాయించడం, పీడించడం వంటి వాటితో సహా ఇతరులతో అసభ్యకరంగా వ్యవహరించడం లేదా వెంటాడటం వంటివి ఉండకూడదు;

f. వర్తించే చట్టాలను ఉల్లంఘించమని ప్రోత్సహించే అంశాలు ఉండకూడదు;

g. సర్వీస్‌లను దుర్వినియోగం చేయడం, హాని కలిగించడం, సర్వీస్‌లలో జోక్యం చేసుకోవడం, లేదా వాటికి అంతరాయం కలిగించడం వంటివి ఉండకూడదు — ఉదాహరణకు, వాటిని మోసపూరితమైన లేదా కపటపూరితమైన మార్గాల్లో యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం, మాల్‌వేర్‌ను పంపించడం, లేదా స్పామ్ చేయడం, హ్యాక్ చేయడం లేదా మా సిస్టమ్‌లు లేదా రక్షణ చర్యలను బైపాస్ చేయడం వంటివి.

సర్వీస్‌కు మీరు సమర్పించే కంటెంట్ విషయంలో, చట్టపరమైన బాధ్యత మీపైనే ఉంటుంది. స్పామ్, ఇంకా మాల్‌వేర్‌తో సహా అతిక్రమణను, అలాగే దుర్వినియోగాన్ని గుర్తించడంలో సహాయపడటానికి మీ కంటెంట్‌ను విశ్లేషించే ఆటోమేటిక్ సిస్టమ్‌లను మేము ఉపయోగించవచ్చు.

మీరు మంజూరు చేసే హక్కులు

మీ కంటెంట్‌పై యాజమాన్య హక్కులు మీకే ఉంటాయి. అయితే, ఈ కింద వివరించిన విధంగా, YouTubeకు, ఇంకా సర్వీస్‌ను ఉపయోగించే ఇతర యూజర్‌లకు మీరు కొన్ని హక్కులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

YouTubeకు లైసెన్స్

సర్వీస్‌కు కంటెంట్‌ను అందించడం ద్వారా, ఆ కంటెంట్‌ను ఉపయోగించడానికి (దాన్ని తిరిగి క్రియేట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఉత్పన్నమైన కంటెంట్‌ను సిద్ధం చేయడం, ప్రదర్శించడం ఇంకా అమలు చేయడంతో సహా) మీరు YouTubeకు ప్రపంచవ్యాప్త, ప్రత్యేకం కాని, రాయల్టీ-రహిత, బదిలీ చేయగల, ఉప లైసెన్స్‌ను ఇవ్వగల లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు. ఆ కంటెంట్‌ను YouTube ఈ సందర్భాలలో మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది: సర్వీస్ అంతటినీ కానీ, లేదా అందులో కొంత భాగాన్ని కానీ ప్రమోట్ చేయడం లేదా తిరిగి డిస్ట్రిబ్యూట్ చేయడం వంటి వాటితో సహా, సర్వీస్, ఇంకా YouTube (దాని వారసత్వ సంస్థలు, అనుబంధ సంస్థల) బిజినెస్‌కు సంబంధించి ఉపయోగించాల్సి వచ్చే సందర్భాలు.

ఇతర యూజర్‌లకు లైసెన్స్

అలాగే, మీ కంటెంట్‌ను తిరిగి క్రియేట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఉత్పన్నమైన కంటెంట్‌ను సిద్ధం చేయడం, ప్రదర్శించడం, ఇంకా అమలు చేయడం వంటి వాటితో సహా, ఆ కంటెంట్‌ను ఉపయోగించడానికి, అలాగే సర్వీస్ ద్వారా కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రపంచవ్యాప్త, ప్రత్యేకం కాని, రాయల్టీ-రహిత లైసెన్స్‌ను, సర్వీస్‌ను ఉపయోగించే ప్రతి యూజర్‌కు మీరు మంజూరు చేస్తున్నారు. ఈ పనులన్నీ సర్వీస్‌లోని ఫీచర్‌ను ఉపయోగించి చేసేవి అయ్యుండాలి (ఉదాహరణకు, వీడియో ప్లేబ్యాక్ లేదా పొందుపరచబడిన వీడియోలు). స్పష్టంగా చెప్పాలంటే, మీ కంటెంట్‌ను సర్వీస్ లోపల కాకుండా బయట ఉపయోగించడానికి యూజర్‌కు ఈ లైసెన్స్, హక్కులను కానీ, లేదా అనుమతులను కానీ ఇవ్వదు.

లైసెన్స్ వ్యవధి

మీరు సర్వీస్ నుండి మీ కంటెంట్‌ను తీసివేసిన లేదా తొలగించిన తర్వాత, మీరు మంజూరు చేసిన లైసెన్స్‌లు వాణిజ్యపరంగా సమంజసమైనంత కాలం వరకు అలాగే కొనసాగుతాయి. అయితే, తీసివేయబడిన లేదా తొలగించబడిన మీ వీడియోలకు సంబంధించిన సర్వర్ కాపీలను YouTube అలాగే ఉంచుకోవచ్చు అని, అయితే ప్రదర్శించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదా అమలు చేయడం వంటివి చేయదని మీరు అర్థం చేసుకొని, అంగీకరిస్తున్నారు.

మానిటైజ్ చేసే హక్కు

సర్వీస్‌లో మీ కంటెంట్‌ను, మానిటైజ్ చేసే హక్కును మీరు YouTubeకు మంజూరు చేస్తున్నారు (అటువంటి మానిటైజేషన్‌లో కంటెంట్‌పై లేదా కంటెంట్ లోపల యాడ్‌లను ప్రదర్శించడం లేదా యాక్సెస్ కోసం యూజర్‌లకు ఫీజు విధించడం వంటివి ఉండవచ్చు). ఈ ఒప్పందానికి అంగీకరించినంత మాత్రాన మీకు ఖచ్చితంగా పేమెంట్‌లు అందుతాయని భావించకూడదు. జూన్ 1, 2021 నుండి, మీకు, అలాగే YouTubeకు మధ్య ఉండే ఏదైనా ఇతర ఒప్పందం ప్రకారం (ఉదాహరణకు, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, లేదా సూపర్ చాట్ కింద వచ్చే పేమెంట్‌లతో సహా), YouTube నుండి మీకు అందాల్సిన ఏ పేమెంట్‌లను అయినా రాయల్టీలుగా పరిగణించడం జరుగుతుంది.  చట్టం ప్రకారం అవసరమైతే, అటువంటి పేమెంట్‌ల నుండి ట్యాక్స్‌లను Google విత్‌హోల్డ్ చేస్తుంది.

మీ కంటెంట్‌ను తీసివేయడం

మీరు ఏ సమయంలో అయినా సర్వీస్ నుండి మీ కంటెంట్‌ను తీసివేయవచ్చు. కంటెంట్‌ను తీసివేసే ముందు, మీ కంటెంట్‌కు ఒక కాపీని క్రియేట్ చేసుకొనే ఆప్షన్ కూడా మీకు ఉంది. ఈ నియమాల ప్రకారం, అవసరమైన హక్కులు ఇప్పుడు మీకు లేనట్లయితే, మీ కంటెంట్‌ను మీరు తప్పనిసరిగా తీసివేయాలి.

YouTube ద్వారా కంటెంట్ తీసివేత

మీ కంటెంట్‌లో ఏదైనా (1) ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే విధంగా, లేదా (2) YouTubeకు, మా యూజర్‌లకు, లేదా థర్డ్-పార్టీలకు హాని కలిగించే విధంగా ఉందని మాకు సహేతుకంగా అనిపించినప్పుడు, అలాగే వర్తించే చట్టానికి అనుగుణంగా సదరు కంటెంట్‌ను తీసివేసే లేదా తొలగించే హక్కు మాకు ఉంది. మేము తీసుకొన్న చర్యకు సంబంధించిన కారణాన్ని మీకు తెలియజేస్తాము, అయితే మీకు తెలియజేయడం వలన ఇక్కడ పేర్కొన్నవి జరుగుతాయని మాకు సహేతుకంగా అనిపించినప్పుడు, మేము తెలియజేయము: (a) చట్టం, లేదా చట్టాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం ఇచ్చిన నిర్దేశం ఉల్లంఘనకు గురి కావచ్చని అనిపించినప్పుడు, లేదా YouTube లేదా మా అనుబంధ సంస్థలకు చట్టపరమైన బాధ్యతను వహించాల్సి వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు; (b) విచారణకు భంగం కలగవచ్చని అనిపించినప్పుడు లేదా సర్వీస్ సమగ్రతకు లేదా ఆపరేషన్‌కు భంగం కలగవచ్చని అనిపించినప్పుడు; లేదా (c) ఏ యూజర్‌కు అయినా, ఇతర థర్డ్-పార్టీకి అయినా, YouTubeకు, లేదా మా అనుబంధ సంస్థలకు అయినా హాని కలగవచ్చని అనిపించినప్పుడు. అప్పీల్ చేయడం ఎలా అనే దానితో సహా రిపోర్టింగ్ గురించి, ఇంకా ఆంక్షల గురించి, మా సహాయ కేంద్రంలోని పరిష్కార ప్రక్రియ పేజీలో మీరు మరింత తెలుసుకోవచ్చు.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు

ఏ కంటెంట్ అయితే, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తోందో, ఆ కంటెంట్ విషయంలో, "స్ట్రయిక్‌లు" అని పిలవబడే సిస్టమ్‌ను YouTube రన్ చేస్తోంది. ఒక్కో స్ట్రయిక్‌లో ఒక్కో రకమైన పరిమితులు ఉంటాయి, స్ట్రయిక్‌ల వలన YouTube నుండి మీ ఛానెల్‌ను శాశ్వతంగా తీసివేసే అవకాశం కూడా ఉంది.  మీ ఛానెల్‌ను స్ట్రయిక్ ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరణ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ల గురించి పరిచయం పేజీలో అందుబాటులో ఉంది. మీకు పొరపాటున స్ట్రయిక్ జారీ అయిందని అనిపిస్తే, మీరు ఇక్కడ అప్పీల్ చేయవచ్చు.

స్ట్రయిక్ కారణంగా మీ ఛానెల్‌పై పరిమితులు విధించబడితే, ఈ పరిమితులను తప్పించుకోవడానికి మీరు మరొక ఛానెల్‌ను ఉపయోగించకూడదు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే, ఈ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లుగా పరిగణించడం జరుగుతుంది, మీ Google ఖాతాతో పాటు, సర్వీస్ అంతటికీ లేదా కొంత భాగానికి మీకు యాక్సెస్‌ను రద్దు చేసే హక్కు Googleకు ఉంది.

కాపీరైట్ రక్షణ

ఆన్‌లైన్‌లో కాపీరైట్ హక్కుదారుల మేధోసంపత్తిని మేనేజ్ చేయడంలో కాపీరైట్ హక్కుదారులకు సహాయపడటానికి, మా YouTube కాపీరైట్ కేంద్రం‌లో సమాచారాన్ని అందిస్తాము. ఈ సర్వీస్‌లో మీ కాపీరైట్ అతిక్రమించబడిందని మీకు అనిపిస్తే, మాకు నోటీసును పంపించండి.

ఏ నోటీసులలో అయితే కాపీరైట్ ఉల్లంఘన జరిగింది అని ఆరోపించడం జరిగిందో, ఆ నోటీసులకు మా YouTube కాపీరైట్ కేంద్రం‌లో పేర్కొనబడిన ప్రాసెస్ ఆధారంగా మేము ప్రతిస్పందిస్తాము, ఈ లింక్‌లో, కాపీరైట్ స్ట్రయిక్‌ను ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు లభిస్తుంది. తగిన సందర్భాలలో, YouTube పాలసీల ప్రకారం, తరచుగా అతిక్రమించే వారికి సర్వీస్‌కు ఉన్న యాక్సెస్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.

ఖాతా సస్పెన్షన్, రద్దు

మీరు చేసే రద్దులు

మీరు ఏ సమయంలో అయినా సర్వీస్‌ను ఉపయోగించడం ఆపివేయవచ్చు. మీ Google ఖాతా నుండి సర్వీస్‌ను తొలగించడానికి, ఈ సూచనలను ఫాలో అవ్వండి, ఇందులో భాగంగా మీ YouTube ఛానెల్ మూసివేయబడటంతో పాటు, మీ డేటా కూడా తీసివేయబడుతుంది. మొదట, మీ డేటాకు సంబంధించి ఒక కాపీని డౌన్‌లోడ్ చేసుకొనే ఆప్షన్ కూడా మీకు ఉంది.

YouTube చేసే రద్దులు, సస్పెన్షన్‌లు

ఇక్కడ పేర్కొన్న సందర్భాలలో, మీ Google ఖాతాను సస్పెండ్ చేసే లేదా రద్దు చేసే హక్కు,  లేదా సర్వీస్ అంతటికీ లేదా సర్వీస్‌లోని కొంత భాగానికి మీ యాక్సెస్‌ను సస్పెండ్ చేసే లేదా రద్దు చేసే హక్కు YouTubeకు ఉంది: (a) ఈ ఒప్పందాన్ని మీరు తీవ్రంగా లేదా పదే పదే ఉల్లంఘిస్తూ ఉన్నప్పుడు; (b) చట్టపరమైన అవసరాన్ని లేదా న్యాయస్థాన ఆదేశాన్ని పాటించడం కోసం మేము ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు; లేదా (c) ఏ యూజర్‌కు అయినా కానీ, ఇతర థర్డ్-పార్టీకి కానీ, YouTubeకు కానీ, లేదా మా అనుబంధ సంస్థలకు కానీ హాని కలిగించేలా (లేదా కలిగించవచ్చు అనిపించేలా), లేదా బాధ్యులను చేసే విధంగా (లేదా బాధ్యులను చేయవచ్చు అనిపించేలా) మీ ప్రవర్తన ఉందని మాకు అనిపించినప్పుడు.

రద్దుకు లేదా సస్పెన్షన్‌కు నోటీసు

YouTube, రద్దు లేదా సస్పెండ్ చేస్తే, అందుకు సంబంధించిన కారణాన్ని మీకు తెలియజేస్తాము, అయితే మీకు తెలియజేయడం వలన ఇక్కడ పేర్కొన్నవి జరుగుతాయని మాకు సహేతుకంగా అనిపించినప్పుడు, మేము తెలియజేయము: (a) చట్టం, లేదా చట్టాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం ఇచ్చిన నిర్దేశం ఉల్లంఘనకు గురి కావచ్చని అనిపించినప్పుడు; (b) విచారణకు భంగం కలగవచ్చని అనిపించినప్పుడు; (c) సర్వీస్ సమగ్రతకు, ఆపరేషన్‌కు లేదా సెక్యూరిటీకి భంగం కలగవచ్చని అనిపించినప్పుడు; లేదా (d) ఏ యూజర్‌కు అయినా కానీ, ఇతర థర్డ్-పార్టీకి కానీ, YouTubeకు కానీ, లేదా మా అనుబంధ సంస్థలకు కానీ హాని కలగవచ్చని అనిపించినప్పుడు. సర్వీస్‌లో మార్పుల కారణంగా, మీ ఉపయోగాన్ని YouTube రద్దు చేస్తున్నట్లయితే, సహేతుకంగా సాధ్యమైన సందర్భాలలో, సర్వీస్ నుండి మీ కంటెంట్‌ను ఎగుమతి చేయడానికి మీకు తగినంత సమయం ఇవ్వబడుతుంది.

ఖాతా సస్పెన్షన్ లేదా రద్దు తాలూకు ప్రభావం

మీ Google ఖాతా రద్దు చేయబడితే లేదా సర్వీస్‌కు మీ యాక్సెస్ పరిమితం చేయబడితే, మీరు ఖాతా లేకుండానే సర్వీస్‌కు సంబంధించిన నిర్దిష్ట అంశాలను (ఉదాహరణకు, కేవలం చూసే వీలు మాత్రమే ఉండటం) ఉపయోగించడం కొనసాగించవచ్చు, ఇటువంటి వినియోగానికి కూడా ఈ ఒప్పందం వర్తింపు కొనసాగుతుంది. మీ Google ఖాతాకు సంబంధించిన రద్దు కానీ, లేదా సస్పెన్షన్ కానీ పొరపాటున జరిగిందని మీకు అనిపిస్తే, మీరు ఈ ఫారమ్‌ను ఉపయోగించి అప్పీల్ చేయవచ్చు.

సర్వీస్‌లోని సాఫ్ట్‌వేర్ గురించి

డౌన్‌లోడ్ చేయగల సాఫ్ట్‌వేర్

సర్వీస్‌కు డౌన్‌లోడ్ చేయగల సాఫ్ట్‌వేర్ (ఉదాహరణకు, YouTube Studio అప్లికేషన్) అవసరం అయినప్పుడు, లేదా సర్వీస్‌లో సదరు సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు, ఆ సాఫ్ట్‌వేర్, లైసెన్స్‌ను అందించే అదనపు నియమాలకు కట్టుబడి ఉంటే తప్ప, సర్వీస్‌లో భాగంగా YouTube అందించే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి YouTube మీకు వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, రాయల్టీ-రహిత, కేటాయించదగని, ఇంకా ప్రత్యేకం కాని లైసెన్స్‌ను ఇస్తుంది. YouTube అందించే సర్వీస్‌కు సంబంధించిన ప్రయోజనాలను, ఈ ఒప్పందంలో పేర్కొన్న విధంగా, ఉపయోగించి, ఆస్వాదించే వీలును మీకు అందించడమే ఈ లైసెన్స్ ఏకైక ఉద్దేశం. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ఏ భాగాన్ని అయినా కానీ కాపీ చేసే, మార్చే, డిస్ట్రిబ్యూట్ చేసే, విక్రయించే, ఉప లైసెన్స్‌ను ఇచ్చే లేదా లీజుకు ఇచ్చే అనుమతి మీకు లేదు. మీకు YouTube నుండి రాతపూర్వక అనుమతి లభించి ఉంటే తప్ప మీరు వీటిని చేయలేరు.

ఓపెన్ సోర్స్

మా సర్వీస్‌లో ఉపయోగించబడే కొన్ని సాఫ్ట్‌వేర్‌లు, మేము మీకు అందించే ఓపెన్ సోర్స్, రాయల్టీ-రహిత లైసెన్స్ కింద అందించబడవచ్చు. ఈ నియమాలలో కొన్నింటిని స్పష్టంగా ఓవర్‌రైడ్ చేసే నిబంధనలు ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లో ఉండవచ్చు, కాబట్టి దయచేసి ఆ లైసెన్స్‌లను తప్పక చదివేలా చూసుకోండి.  

ఇతర చట్టపరమైన నియమాలు

వారంటీ నిరాకరణ

ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొని ఉంటే తప్ప, లేదా చట్టం ప్రకారం అవసరమైతే తప్ప, సర్వీస్ అనేది "యథాతథంగా" అందించబడుతుంది, సర్వీస్ గురించి YouTube ఎలాంటి నిర్దిష్ట వాగ్దానాలనూ చేయదు లేదా ఎలాంటి వారంటీలనూ అందించదు. ఉదాహరణకు, మేము వీటి విషయంలో ఎలాంటి వారంటీలనూ అందించబోము: (A) ఈ సర్వీస్ ద్వారా అందించబడే కంటెంట్ విషయంలో; (B) సర్వీస్‌కు సంబంధించిన నిర్దిష్ట ఫీచర్‌ల విషయంలో, లేదా వాటి ఖచ్చితత్వం, విశ్వసనీయత, లభ్యత, లేదా మీ అవసరాలకు అనుగుణంగా ఉండగల సామర్థ్యం విషయంలో; లేదా (C) మీరు సమర్పించే ఏ కంటెంట్ అయినా సర్వీస్‌లో యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంలో.

చట్టపరమైన బాధ్యత పరిమితి

వర్తించే చట్టం ప్రకారం అవసరమైన పరిస్థితులలో తప్ప, ఈ కింద పేర్కొన్న వాటి కారణంగా లాభాలు, ఆదాయాలు, బిజినెస్ అవకాశాలు, గుడ్‌విల్, లేదా ఆశించిన సేవింగ్స్‌లో నష్టాలకు; డేటా నష్టానికి లేదా డేటా పాడవ్వడానికి; పరోక్షంగా లేదా ఏదైనా చర్యకు పర్యవసానంగా జరిగే నష్టాలకు; శిక్షగా విధించే జరిమానాలకు YouTube, దాని అనుబంధ సంస్థలు, ఆఫీసర్‌లు, డైరెక్టర్‌లు, ఉద్యోగులు, ఇంకా ఏజెంట్‌లు ఎలాంటి బాధ్యతా వహించరు:

  1. సర్వీస్‌లోని ఎర్రర్‌లు, పొరపాట్లు, లేదా తప్పుల కారణంగా;
  2. మీరు సర్వీస్ ఉపయోగించడం వల్ల జరిగే వ్యక్తిగత గాయం, లేదా ఆస్తి నష్టం కారణంగా;
  3. సర్వీస్‌ను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించిన కారణంగా;
  4. సర్వీస్‌కు అంతరాయం ఏర్పడిన కారణంగా లేదా సర్వీస్ నిలిచిపోయిన కారణంగా;
  5. ఏదైనా థర్డ్-పార్టీ వలన సర్వీస్‌కు లేదా సర్వీస్ ద్వారా ఏవైనా వైరస్‌లు లేదా హానికరమైన కోడ్ పంపిన కారణంగా;
  6. కంటెంట్‌కు సంబంధించి మీ వినియోగంతో సహా, యూజర్ లేదా YouTube సమర్పించిన కంటెంట్ కారణంగా; మరియు/లేదా
  7. కంటెంట్‌ను తీసివేయడం లేదా కంటెంట్ అందుబాటులో లేకపోవడం కారణంగా.

క్లెయిమ్ అనేది వారంటీ, ఒప్పందం, వికర్మ, లేదా మరేదైనా చట్టపరమైన సిద్ధాంతం ఆధారంగా చేయబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఏ క్లెయిమ్‌కు అయినా ఈ నిబంధన వర్తిస్తుంది.

వర్తించే చట్టం ప్రకారం అనుమతించబడిన మేరకు, సర్వీస్ మూలంగా తలెత్తే ఏవైనా క్లెయిమ్‌ల విషయంలో, లేదా సర్వీస్‌కు సంబంధించిన ఏవైనా క్లెయిమ్‌ల విషయంలో YouTube, ఇంకా దాని అనుబంధ సంస్థల మొత్తం బాధ్యత, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుందో, దాని వరకే పరిమితం అవుతుంది: (A) క్లెయిమ్ గురించి మీరు YouTubeకు రాతపూర్వకంగా నోటీసు సమర్పించిన తేదీకి 12 నెలల ముందు వరకు మీరు సర్వీస్‌ను ఉపయోగించినందుకు YouTube మీకు పే చేసిన ఆదాయ మొత్తం ఇంకా (B) USD $500, ఈ రెండింటిలో ఎక్కువ ఉన్న దానికి.

నష్ట పరిహార ఒప్పందం

వర్తించే చట్టం ప్రకారం అనుమతించబడిన మేరకు, వీటి కారణంగా తలెత్తే క్లెయిమ్‌లు, నష్టపరిహారాలు, అనివార్యకార్యాలు, నష్టాలు, బాధ్యతలు, ఖర్చులు లేదా రుణాలు, వ్యయాలు (న్యాయవాది ఫీజుతో సహా కానీ దీనికే పరిమితం కాదు) నుండి YouTubeను, దాని అనుబంధ సంస్థలను, ఆఫీసర్‌లను, డైరెక్టర్‌లను, ఉద్యోగులను, ఏజెంట్‌లను రక్షించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, హాని జరగకుండా కాపాడటానికి మీరు అంగీకరిస్తున్నారు: (i) సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగం కారణంగా; (ii) ఈ సర్వీస్ నియమాలలో దేనినైనా మీరు ఉల్లంఘించిన కారణంగా; (iii) కాపీరైట్, ప్రాపర్టీ, లేదా గోప్యత హక్కు (వీటితో సహా, కానీ వీటికే పరిమితం కాదు) వంటి మీరు ఏదైనా థర్డ్-పార్టీ హక్కును ఉల్లంఘించిన కారణంగా; లేదా (iv) మీ కంటెంట్ వల్ల థర్డ్-పార్టీకి నష్టం జరిగిందని చేయబడిన ఏదైనా క్లెయిమ్ కారణంగా. రక్షించడానికి, ఇంకా నష్ట పరిహారం చెల్లించడానికి సంబంధించిన ఈ అనివార్యకార్యం, ఈ ఒప్పందం ముగిసిన తర్వాత, అలాగే మీరు సర్వీస్‌ను ఉపయోగించడం ముగిసిన తర్వాత కూడా అమలులో ఉంటుంది.

థర్డ్-పార్టీ లింక్‌లు

YouTube యాజమాన్యంలో కానీ లేదా కంట్రోల్‌లో కానీ లేని థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లకు, ఇంకా ఆన్‌లైన్ సర్వీస్‌లకు లింక్‌లు సర్వీస్‌లో ఉండవచ్చు. అలాంటి వెబ్‌సైట్‌లపై, ఇంకా ఆన్‌లైన్ సర్వీస్‌లపై YouTubeకు కంట్రోల్ ఉండదు, అలాగే వాటికి బాధ్యత కూడా వహించదు. మీరు సర్వీస్ నుండి నిష్క్రమించేటప్పుడు జాగ్రత్త వహించాలి; మీరు వెళ్లే ప్రతి థర్డ్-పార్టీ వెబ్‌సైట్, ఇంకా ఆన్‌లైన్ సర్వీస్‌కు సంబంధించిన నియమాలను, అలాగే గోప్యతా పాలసీని చదవాల్సిందిగా మేము సూచిస్తున్నాము.

ఈ ఒప్పందం గురించి

 ఒప్పందాన్ని మార్చడం

ఇక్కడ పేర్కొన్నవి చేయడానికి మేము ఈ ఒప్పందాన్ని మార్చవచ్చు, (1) మా సర్వీస్‌లో, అలాగే మేము బిజినెస్ చేసే విధానంలో మార్పులను ప్రతిబింబించడానికి - ఉదాహరణకు, మేము కొత్త ప్రోడక్ట్‌లను లేదా ఫీచర్‌లను జోడించినప్పుడు, లేదా పాత వాటిని తీసివేసినప్పుడు, (2) చట్టపరమైన, రెగ్యులేటరీ సంబంధిత, ఇంకా సెక్యూరిటీ సంబంధిత కారణాలకు, లేదా (3) దుర్వినియోగాన్ని లేదా హానిని నిరోధించడానికి .

ఒకవేళ ఈ ఒప్పందంలో మేము గణనీయమైన స్థాయిలో మార్పులు చేస్తే, ఇక్కడ పేర్కొన్న సందర్భాలలో తప్ప, ఆ మార్పులను రివ్యూ చేసే అవకాశం మీకు కల్పించేందుకు, మేము సముచిత అడ్వాన్స్ నోటీసును మీకు అందిస్తాము, (1) మేము కొత్త ప్రోడక్ట్‌ను లేదా ఫీచర్‌ను లాంచ్ చేసినప్పుడు, లేదా (2) కొనసాగుతున్న దుర్వినియోగాన్ని నిరోధించడం లేదా చట్టపరమైన అవసరాలకు ప్రతిస్పందించడం వంటి అత్యవసర పరిస్థితులలో. మీరు కొత్త నియమాలను అంగీకరించకపోతే, మీరు అప్‌లోడ్ చేసిన ఏదైనా కంటెంట్‌ను తీసివేసి, సర్వీస్‌ను ఉపయోగించడం ఆపివేయాలి.

ఈ ఒప్పందం యొక్క కొనసాగింపు

సర్వీస్‌కు సంబంధించి మీ వినియోగం ముగిస్తే, ఈ ఒప్పందానికి చెందిన ఈ నియమాలు మీకు వర్తించడం కొనసాగుతాయి: "లైసెన్స్ వ్యవధి"లో వివరించబడిన విధంగా, "ఇతర చట్టపరమైన నియమాలు", "ఈ ఒప్పందం గురించి", ఇంకా మీరు మంజూరు చేసిన లైసెన్స్‌లు అలాగే కొనసాగుతాయి.

వియోజనం

ఏ కారణం చేత అయినా ఈ ఒప్పందంలోని నిర్దిష్ట నియమాన్ని అమలు చేయడం సాధ్యం కాదని తేలితే, అది ఇతర నియమాలను ప్రభావితం చేయదు.

మాఫీ చేయడం ఉండదు

మీరు ఈ ఒప్పందాన్ని పాటించడంలో విఫలం అయినప్పుడు, వెంటనే మేము ఏ చర్యా తీసుకోకపోతే, మాకు ఉండే అవకాశం ఉన్న హక్కులను (ఉదాహరణకు, భవిష్యత్తులో చర్య తీసుకొనే హక్కు) మేము వదులుకుంటున్నామని అర్థం చేసుకోరాదు.

అర్థం

ఈ నియమాలలో, "ఉంటాయి" లేదా "సహా" అంటే "వీటితో సహా, కానీ వీటికే పరిమితం కాదు" అని అర్థం, అలాగే ఉదాహరణలను కేవలం మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే అందించడం జరిగింది.

పాలక చట్టం

ఈ నియమాలు లేదా సర్వీస్ మూలంగా తలెత్తే, లేదా వాటికి సంబంధించిన వివాదాలన్నీ కాలిఫోర్నియా చట్టానికి లోబడి ఉంటాయి (పరస్పర విరుద్ధమైన చట్ట సంబంధిత నియమాలతో సంబంధం లేకుండా). ఈ వివాదాలకు సంబంధించిన న్యాయ విచారణ USAలోని కాలిఫోర్నియాకు చెందిన శాంటా క్లారా కౌంటీలోని ఫెడరల్ లేదా రాష్ట్ర న్యాయస్థానాలలో మాత్రమే జరుగుతుంది. మీరు, అలాగే YouTube, ఇక్కడి న్యాయస్థానాల్లో విచారణ జరగడానికి సమ్మతిస్తున్నారు.

కాలిఫోర్నియా న్యాయస్థానంలో ఈ వివాదాల పరిష్కారానికి వర్తించే స్థానిక చట్టం అడ్డుగా ఉంటే, మీరు ఈ వివాదాలను మీ స్థానిక న్యాయస్థానాలలో ఫైల్ చేయవచ్చు. అలాగే, ఒకవేళ ఈ వివాదాలను పరిష్కరించడానికి కాలిఫోర్నియా చట్టాన్ని వర్తింపజేయకుండా వర్తించే స్థానిక చట్టం మీ స్థానిక న్యాయస్థానాన్ని నివారిస్తే, అప్పుడు ఈ వివాదాలు మీరు నివాసముంటున్న దేశంలోని చట్టాలకు కట్టుబడి ఉంటాయి.

5 జనవరి, 2022 నుండి అమలులో ఉంది (మునుపటి వెర్షన్‌ని చూడండి)